Mallela Raju Testimonials

ప్రియమైన దేవుని ప్రజలారా మన ప్రియ రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను.

ఏసుక్రీస్తు గొప్ప దేవుడు రక్షకుడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్….

పూర్వము దూషకుడను హింసకుడను, హానికరుడనైనా నన్ను యేసు క్రీస్తు తన మహా కృప చేత నన్ను కనికరించి రక్షించినాడు ప్రభువుకు మహిమ కలుగును గాక.  దేవుని ప్రజలారా నాపేరు మల్లెల రాజు అలియాస్ కత్తుల రాజు,  మా ఊరు నిడుబ్రోలు, పొన్నూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.

మా నాన్న మల్లెల మత్తయ్య మా అమ్మ పేరు శిరోమణి వాళ్లకు 6 మంది సంతానం, ఇద్దరు మగపిల్లలు నలుగురు ఆడపిల్లలు, నేను అందరికంటే ఆఖరివాడిని అందుకనే చాలా గారాబంగా పెంచారు.

నాకు 17 సంవత్సరాల వయసులో నాకు అన్ని అలవాట్లు ఉండేవి తాగుడు సిగిరెట్లు, గుట్కా మత్తు పదార్థాలకు బానిసనై అదే నా జీవితం అనుకున్నాను. అందుకోసం ఏమైనా చేస్తాను అనుకునేవాడిని.

1993-94 లో గుంటూరు గాంధీ పార్క్ లో మెట్రిక్యులేషన్ చదువుతూ మద్యానికి బానిసనై చెడ్డ పనులు చేస్తూ ఎవ్వరు డబ్బులు ఇస్తే వారికే వాళ్లకు సపోర్ట్ చేస్తూ వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేస్తూ ఉండేవాణ్ణి.

నాకు నచ్చింది సెటిల్ మెంట్లు చేయడం నా దగ్గరకి అనేక మంది దొంగనోట్లు దొంగ బంగారం కలిగినవాడు రకరకాల వారితో పరిచయం ఉండేది. కానీ నా జీవితం ఎప్పుడు ముగుస్తుందో నాకు అర్థమయ్యేది కాదు. మా అమ్మ ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేది. అమ్మ ప్రార్ధనే నన్ను బ్రతికించింది అని నేను ఏసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా తెలుసుకున్న తర్వాత గ్రహించాను.

సమాధుల్లో తిరుగుట

విప్లవ ఉద్యమంలో నా పాత్ర 

విప్లవ నాయకుడు గద్దర్తో నాకున్న పరిచయం

చేతబడి చేసే కొండ రాజుతో  ఉన్న బంధం

హైదరాబాద్,  బెంగుళూరు, వైజాగ్ కొన్ని వందల కోట్ల రూపాయల స్థలాలు  ఆక్రమించుట

రాజకీయ నాయకులతో నాకున్న అనుభవం

కత్తుల రాజుగా నా జైలు జీవితం

నేను వెళ్ళాలి అనుకున్నా మార్గం

దేవుడు నన్ను నడిపించిన మార్గం

కువైట్ దేశంలో నా జీవితం మార్పు

పైన తెలుపబడిన సాక్షాన్ని త్వరలో మీముందుకి తీసుకొని వస్తాను

 

 

Mallela Raju © 2018 Design By John 6301188278